‘కర్మ​ కిచెన్​’ ఇన్​స్పిరేషన్​తో కేఫ్స్​

‘కర్మ​ కిచెన్​’ ఇన్​స్పిరేషన్​తో కేఫ్స్​

ఒక్క అహ్మదాబాద్​లోనే కాదు.. పూనే, ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి చాలా సిటీల్లో ఉంది ఈ సేవ కేఫ్​. 2006లో ‘మానవ్​ సదన్’  ఎన్జీవో ఫౌండర్స్​  జాన్ సిల్లిఫాంట్,  జయేష్ పటేల్ ఈ కేఫ్​ని ప్రారంభించారు. అమెరికాలోని శాన్​ ఫ్రాన్సిస్కో, చికాగోలో ఉన్న ‘కర్మ​ కిచెన్​’ ఇన్​స్పిరేషన్​తో మన దగ్గర ఈ కేఫ్​ని పెట్టారు వీళ్లు. అహ్మదాబాద్​లో మొదలైన ఈ కేఫ్​ ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉంది. ప్రాంతాలు వేరైనా ఒకే మోటోతో నడుస్తున్న ఈ కేఫ్స్​లో స్పెషల్​ అట్రాక్షన్స్ బోలెడు..

మరొకరికి గిఫ్ట్ ఇవ్వొచ్చు

ఈ కేఫ్​లోకి ​​ అడుగుపెట్టగానే.. వెయిటర్​ లేదా మేనేజర్​ నవ్వుతూ ఎదురొస్తారు. గ్రాండ్​గా వెల్​కమ్​ చెప్తారు. ఆ తరువాత అక్కడ ఉన్న వలంటీర్స్​  వచ్చి  ప్రేమగా పలకరిస్తారు. ఈ కేఫ్​లోని  టేబుల్స్​ అన్నీ.. జాయ్​, పీస్​, స్మైల్​, యూనిటీ, హ్యాపీనెస్​  లాంటి పేర్లతోనే ఉంటాయి. అంతేకాదు ఫ్రిజ్​, కిచెన్​, గ్యాస్ ​స్టవ్​ అన్నింటికీ పేర్లు ఉంటాయి ఇక్కడ. వస్తువులతో కస్టమర్స్​ని కనెక్ట్​ చేయడానికే ఇలా పేర్లు పెట్టారట. డబ్బులివ్వట్లేదు కదా! అని ఫుడ్ ఎలా ఉంటుందో అనే ఆలోచన​​ అక్కర్లేదు. ఇంటి వంటల రుచికి ఏమాత్రం తీసిపోవు. అవి కడుపారా తిన్నాక‘ ఇంతకుముందు కేఫ్​కి వచ్చిన కస్టమర్​.. మీ బిల్లు కట్టారని చెప్తారు’ వలంటీర్స్​.  కావాలనుకుంటే తర్వాత వచ్చే కస్టమర్​కి గిఫ్ట్​గా తోచినంత డబ్బుల్ని టేబుల్​ మీద ఉన్న ఎన్వలప్​లో పెట్టొచ్చు. అలా తెలియని వాళ్లు ఒకరికొకరు గిఫ్ట్​ ఇచ్చుకోవడం వల్ల జనాల మధ్య నమ్మకం, ప్రేమ పెరుగుతాయనేది ఈ కాన్సెప్ట్​ ఉద్దేశం​.  చాలా సందర్భాల్లో కస్టమర్స్​ తిన్నవాటికి రెట్టింపు డబ్బు ఎన్వలప్​లో పెడతారని చెప్పారు అక్కడి వలంటీర్లు. 

ఈ కేఫ్​లో కుకింగ్​ దగ్గర్నించి..క్లీనింగ్​, ఆర్డర్స్​ తీసుకోవడం, వడ్డించడం.. ​ అన్నీ వలంటీర్లే చేస్తారు. ఈ పనిలో ఉన్న సంతోషాన్ని ఎక్స్​పీరియెన్స్​ చేయడానికి వలంటీర్లుగా చేరామని అందరూ చెప్తారు.  అయితే ఈ కేఫ్​లో వలంటీర్​గా పనిచేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. నలుగురికీ సాయం చేయాలనుకునేవాళ్లు ఎవరైనా ఇందులో భాగం కావొచ్చు. రోజుకి రెండుమూడు గంటల చొప్పున కూడా ఇక్కడ పనిచేయొచ్చు. మనుషుల మధ్య భయాలు, అనుమానాలు పెరిగిపోతున్నాయి. నమ్మకం అనేదాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఆ నమ్మకాన్ని  తిరిగి బతికించడానికి, హ్యుమానిటీని పెంచడానికి ఇదొక ప్రయత్నం అనేది వలంటీర్ల మాట.