
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా 'డ్రాగన్'. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ తొలిసారి చేస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. 'కాంతార' ఫేమ్, నటుడు రిషబ్ శెట్టి ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మూవీ మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు..
కానీ రిషబ్ శెట్టితో మాత్రం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో దీనిపై స్పష్టత రానుందని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే.. ఇద్దరు టాలెంటెడ్ స్టార్స్ ఒకే తెరపై కనిపించనున్నారు. ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తోందని సినీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. 'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ 'డ్రాగన్' సినిమా వాటి కంటే కూడా భారీగా ఉంటుందని టాక్ వినపిస్తోంది . తన కెరీర్ ప్రారంభం నుండి తీయాలనుకున్న సినిమా ఇదేనని సినీ వర్గాలు తెలిపాయి.
ALSO READ : నాని 'ది ప్యారడైజ్'లో మోహన్‌బాబు..
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమా కథకు ఎలాంటి పరిమితులు లేకుండా నీల్ తన విజన్‌ను పూర్తి స్థాయిలో చూపించబోతున్నారని సమాచారం. ఇది ఇండియన్ సినిమాకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాలోని యాక్షన్, విజువల్స్, కథనం అన్నీ కూడా ప్రేక్షకులకి ఒక 'లార్జర్- దాన్ -లైఫ్' అనుభూతిని ఇవ్వనున్నాయి. ఈ 'డ్రాగన్' చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ 'డ్రాగన్' చిత్రంలో నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మే 20 న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ద్వారా ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, సంగీత దర్శకుడు రవి బస్రూర్ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.