
హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ డే కూడానూ.. విమోచనమా.. విలీనమా అనే కాంట్రవర్సీ ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇలా.. సెప్టెంబర్ 17ను ఎవరికి నచ్చిన విధంగా వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది.. సెప్టెంబర్ 17వ తేదీన ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జి మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలంటూ సర్క్యులర్ జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి సైతం సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగరవేయనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన సొంత జిల్లా ఖమ్మంలో జెండా ఆవిష్కరించనున్నారు. మంత్రి వివేక్ మెదక్ జిల్లాలో జెండా ఎగరేయనున్నారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరై జెండా ఆవిష్కరించనున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
►ALSO READ | దేశవ్యాప్తంగా దసరా నవరాత్రిళ్లు వైభవంగా జరిగే ఆలయాలు ఇవే..!