
మరో వారం రోజుల్లో మధ్యతరగతి ప్రజల కోరిక నెరవేరనుంది. దసరా, దీపావళికి నచ్చిన కారు కొనాలనుకుంటున్న చాలా మందికి డబ్బు ఆదా అవబోతోంది. వందల్లో వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో కూడా కారు కంపెనీలు జీఎస్టీ రేట్ల మార్పులతో తమ వివిధ మోడళ్ల రేట్లను తగ్గించేస్తు్న్నాయి. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు తమ బెస్ట్ సెల్లింగ్ కార్లపై భారీ డిస్కౌంట్లను కూడా ప్రకటించేశాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద కార్ల విక్రయదారు మారుతీ సుజుకీ కూడా రేట్ల తగ్గింపుల గురించి ప్రకటించింది.
ఎక్కువ సేల్స్ కలిగిన మారుతీ స్విఫ్ట్ కారు రేటు జీఎస్టీ పన్నుల మార్పుల కారణంగా రూ.లక్ష 6వేలు తగ్గుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో స్విఫ్ట్ కారు మరింత చౌకగా మధ్యతరగతికి అందుబాటులోకి రాబోతోంది సెప్టెంబర్ 22 నుంచి. ఇదే సమయంలో మారుతీ డిజైర్ కార్ రేటు రూ.87వేలు వేరియంట్ల ఆధారంగా తగ్గుతుదని కంపెనీ వెల్లడించింది. దీంతో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ కొనాలనుకుంటున్న ఫ్యామిలీలకు ఇదొక మంచి సెడాన్ అని కంపెనీ చెబుతోంది.
కంపెనీ తన కార్ల ధరల్లో మార్పులు వేరియంట్ల ఆధారంగా మార్పులకు గురవుతాయని చెప్పింది. టాప్ ఎండ్ మోడళ్లపై అత్యధిక తగ్గింపులు ఉంటాయని కంపెనీ చెబుతోంది. డీలర్లు ఇప్పటికే తగ్గించబడిన రేట్లకు అనుగుణంగా ప్రీ బుక్కింగ్స్ కూడా ఓపెన్ చేశారు దేశవ్యాప్తంగా.
►ALSO READ | పర్సనల్ లోన్ EMI చెల్లించలేకపోతున్నారా? సెటిల్ చేసుకోవటానికి మార్గాలివే..
ఇదే సమయంలో మారుతీ ఆల్టో రేటు రూ.50వేల వరకు తగ్గింపులను చూస్తుండగా.. మారుతీ ఎస్ ప్రెసో రూ.44వేలు, మారుతు సుజుకీ వ్యాగన్ ఆర్ రూ.64వేలు, మారుతీ సెలీరియో రూ.54వేల వరకు తగ్గింపులను చూస్తున్నాయి. ఇదే క్రమంలో మారుతీ సుజుకీ బ్యాలినో రేటు రూ.91వేల వరకు తగ్గింపులకు అందుబాటులో ఉంచింది కంపెనీ. ఇక చివరిగా మారుతీ ఇగ్నైస్ మోడల్ రేట్లపై రూ.69వేల వరకు తగ్గింపులను కంపెనీ ఆఫర్ చేస్తోంది.