
సాధారణంగా చాలా మంది ఏదైనా ఆర్థిక ఇబ్బంది లేదా అవసరం రాగానే వెంటనే తీసుకునేది పర్సనల్ లోన్. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా వీటిని ఎక్కువగా ఉద్యోగులకు ఆఫర్ చేస్తుంటాయి. అయితే వాస్తవానికి ఇవి అత్యంత ఖరీదైన రుణాల కేటగిరీలోకి వస్తాయి. ఇక్కడ సిబిల్ స్కోర్ ఇతర అంశాల ఆధారంగా వివిధ సంస్థలు వేరువేరు వడ్డీలు, ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తుంటాయి. అత్యవసర సమయాన్ని ఇవి ఖరీదైనప్పటికీ చాలా మంది తీసుకుంటుంటారు. ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కటం కోసం చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో ఈఎంఐ చెల్లింపులను కష్టతరం చేస్తుంటాయి. దీంతో చాలా మంది రుణాల ఊబిలో చిక్కుకుని బయటపడటానికి మార్గాల కోసం అన్వేషిస్తుంటారు.
* ముందుగా సకాలంలో ఈఎంఐ చెల్లింపులు చేయలేని సమయంలో మీరు రుణం పొందిన బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థను సంప్రదించటం మంచిది. మీ పరిస్థితిని వెల్లడించి ఉపశమనం కోసం కొంత గడువు పొందవచ్చు. అనేక సార్లు నిజమైన కారణాలను బ్యాంకులు అర్థం చేసుకుని ఉపశమనం కల్పిస్తుంటాయి.
* వాస్తవానికి పర్సనల్ లోన్స్ ఖరీదైనవి కాబట్టి వేరే బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని పొందటం ద్వారా లోన్ బ్యాలెన్స్ బదిలీకి వెళ్లటం మంచిది. దీంతో కొత్త బ్యాంకు మీ పాత రుణాన్ని చెల్లించి.. తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని ఇస్తుంది. ఇది మీ EMI చెల్లించాల్సిన భారాన్ని తగ్గిస్తుంది. దీంతో పరోక్షంగా కొంత అదనపు నిధులు లభిస్తాయి.
►ALSO READ | Gold Rate: దసరా వారం వచ్చేసింది : బంగారం ధరలు పెరిగాయా.. తగ్గాయా..?
* రుణ ఈఎంఐలను సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు రుణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. దీని వల్ల బ్యాంకులు మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మెుత్తాన్ని, కాలాన్ని మార్పులు చేస్తుంటాయి.
* మీ ఆర్థిక పరిస్థితుల దారణంగా ఉండటం వల్ల ఈఎంఐ అస్సలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే రుణ వన్ టైమ్ సెటిల్మెంట్ కోసం వెళ్లవచ్చు. ఈ క్రమంలో బ్యాంకులు మీరు చెల్లించాల్సి మెుత్తంలో 50 శాతం వరకు వసూలు చేసి మిగిలిన దాన్ని మాఫీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సెటిల్మెంట్ సాధారణంగా ఒక వారంలోపు చేయాలి. వన్-టైమ్ సెటిల్మెంట్ మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గుర్తించుకోవాలి. అందుకే దీనిని తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఎంచుకోవాలి.