
ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు ప్రాజక్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతించి.. నిధులు మంజూరుకు ఓకే చేసినట్లు కేంద్ర మంత్రి బండి సజయ్ వెల్లడించారు.
మానేరు నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం రూ.77 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపినట్లు మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఈ వంతెనతో గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుందని ఆయన తెలిపారు.
అదే విధంగా వేములవాడ – సిరికొండ రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. దీనితో పాటు ఆర్నకొండ – మల్యాల డబుల్ రోడ్డు విస్తరణకు రూ.50 కోట్ల మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో 15 గ్రామాల పోరాటం ఫలించిందని ఆయన అన్నారు. మొత్తంగా కరీంనగర్ పార్లమెంట్‌కు రూ.150 కోట్ల భారీ కేటాయింపులు జరిపినట్లు బండి సంజయ్ చెప్పారు.