అతి పెద్ద హిందూ దేవాలయం ఆంగ్‌కార్‌ మూసివేత

V6 Velugu Posted on Apr 08, 2021

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటి కాంబోడియాలోని ఆంగ్‌కార్‌ ఆలయం. ఆ దేవాలయాన్ని ఈ నెల 20 నుంచి మూసివేయనుంది ఆ దేశం. ఆసియా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈనెల 20 నుంచి ఆలయం కాంప్లెక్స్‌లోకి భక్తులను అనుమతించరాదని కాంబోడియా నిర్ణయించింది. గతేడాది కాంబోడియాలో 3028 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 23 మంది చనిపోయారు. ఈ ఏడాది కరోనా నింధనలకు విరుద్ధంగా ఓ విదేశీ వ్యక్తి నైట్‌క్లబ్‌కు హాజరు కావడంతో కాంబోడియా కరోనా నిబంధనలను మరింత కఠినం చేసింది.

Tagged cambodia

More News