కెమెరా ఫస్ట్.. ప్రధాని మోడీ ఫొటోను షేర్ చేసిన ప్రకాష్ రాజ్

కెమెరా ఫస్ట్.. ప్రధాని మోడీ ఫొటోను షేర్ చేసిన ప్రకాష్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీ సెటైర్లు వేసి, వార్తల్లో నిలిచారు. గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీ ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలోని ఫొటోలను ప్రకాష్​ రాజ్​ ట్విట్టర్ లో షేర్​ చేశారు. దాంతో పాటు కెమెరా ఫస్ట్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఫొటో, క్యాప్షన్ తో పాటు కెమెరాజీవి, జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ లను ప్రకాష్ రాజ్ జత చేయడం చర్చనీయాంశంగా మారింది. 

గుజరాత్ లో ఇటీవల చివరి దశ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా సాధారణ పౌరుడిలా క్యూలైన్లో నిలబడి ఓటేశారు. అయితే ఈ ఓటింగ్ సందర్భంలో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.