ముగిసిన లోక్సభ ఆరో దశ ఎన్నికల ప్రచారం

ముగిసిన లోక్సభ ఆరో దశ ఎన్నికల ప్రచారం

లోక్సభ 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు ఈనెల 25న ఉదయం 7గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇందులో హర్యానా, ఢిల్లీ సీట్లు ఉండటం విశేషం. మొత్తం 889 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఢిల్లీలో ఏడు స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఏ మేర ప్రభావంచూపు తాయ న్నది తెలియాల్సి ఉంది. ఈ ఫేజ్ లో యూపీలో  14 సీట్లు, హర్యానాలోని 10 సీట్లు ఉన్నాయి. గెలుపుపై ఎన్డీఏ కూటమి, ఇండియా కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చేనెల 1వ తేదీన చివరి దశ ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి.