
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎలక్షన్ క్యాంపెయిన్ మూడు నెలల ముందు నుంచే ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో పోటీలోఉండే క్యాండిడేట్లు మంగళవారం నుంచి ప్రచారాన్ని మరింత పెంచనున్నారు. ఇప్పటికే రెండు, మూడు చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. లిస్ట్ రావడంతో ఇప్పుడు మిగిలిన వాళ్లందరూ కూడా వారి నియోజకవర్గాల్లో ప్రచారంపై దృష్టిసారించనున్నారు. ఈ మేరకు అధినేత కేసీఆర్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో క్షేత్రస్థాయిలో లీడర్లను ఓటింగ్ డే వరకు కాపాడుకునేందుకు కష్టాలు తప్పవని అంటున్నారు. ఇప్పటికే అటు.. ఇటు మారుతున్న లీడర్లతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. అందరిని మేనేజ్ చేసుకునేందుకు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందోనని అంటున్నారు.