
జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం మీదుగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విధించిన భారీ వాహనాల రాకపోకల నిషేధాన్ని ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ సామాజికవేత్త శ్రీరాముల భూమాచారి ఆధ్వర్యంలో మండలంలోని ఇందన్పెల్లి, నాయకపుగూడ గ్రామాల్లో ప్లెక్సీల ద్వారా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా భూమాచారి మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారులు ఆంక్షలు ఎత్తివేయకపోతే జన్నారం మండల అభివృద్ధి కుంటుపడుతుందని, వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అంక్షలు ఎత్తేసే వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామని వెల్లడించారు. ఆయన వెంట ఆయా గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.