వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపలేం.. థర్డ్ వేవ్ డేంజర్ పొంచి ఉంది

V6 Velugu Posted on May 05, 2021

  • కనీసం 2 వారాలు కఠిన లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం: ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారుతూపోతే మూడో వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రావొచ్చన్న గులేరియా 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇలానే మార్పు చెందుతూ పోతే, మనుషుల ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునే మెకానిజం డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటే, దేశంలో మూడో వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. వ్యాక్సిన్లను వీలైనంత ఎక్కువ మందికి అందించగలిగితే వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభావం అంతగా ఉండకపోవచ్చన్నారు. నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్ఫ్యూలు, వీకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాప్తిని అరికట్టలేమని చెప్పారు. కఠినమైన లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడితే వ్యాప్తి తగ్గే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని.. కనీసం రెండు వారాల పాటు లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలని అన్నారు. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి నిర్ణయం తీసుకుంటూనే ప్రజలకు నిత్యావసరాలతో పాటు రోజువారి కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. ప్రస్తుతం మూడు విషయాలను గుర్తుంచుకోవాలని.. ‘హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచుకోవాలి. కేసులను తగ్గించాలి. వ్యాక్సిన్లు వేయాలి’ అని సూచించారు. ఇండియాలోని డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యుటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని గులేరియా చెప్పారు. అయితే కరోనా కట్టడికి మనదగ్గర సరైన మెకానిజం లేకపోవడమే కారణమని మాత్రం విమర్శించలేమన్నారు.  

వైరస్‌లో మార్పులే సెకండ్ వేవ్ తీవ్రతకు కారణం
కరోనా వైరస్ లో మార్పులే సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉండడానికి కారణమని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా వెల్లడించారు. భారత దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రకాల స్ట్రెయిన్లు రోగనిరోధక వ్యవస్థకు చిక్కడం లేదు, ఇలాంటి స్ట్రెయిన్లతో మూడో వేవ్ ముప్పు పొంచి ఉంది, పరిస్థితిని కట్టడి చేయాలంటే ప్రత్యామ్యాయాలు కనిపించడం లేదు..  దేశంలో కనీసం 2 వారాలపాటు కఠినమైన లాక్‌డౌన్ చాలా అవసరం.. ప్రజలు కూడా పరిస్థితి తీవ్రతను గుర్తించి సామాజిక దూరం పాటించాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉంటే వారికి, ఇతరులందరికీ మంచిది.  కఠిన లాక్‌డౌన్‌తోనే వ్యాప్తిని నియంత్రించగలమే తప్ప నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్లతో ప్రయోజనం లేదు.. ఏ మాత్రం నిర్లక్స్యం చేసినా.. జాగ్రత్తలు పాటించకున్నా భయంకరమైన పరిస్థితులు చవి చూడాల్సి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. 
 

Tagged , curfew status, virus can stop, lockdown required, AIIMS warning, aims director guleria comments, third wave chances

Latest Videos

Subscribe Now

More News