షుగర్​ పేషెంట్లు మామిడి పండ్లు తినొచ్చా..?

షుగర్​ పేషెంట్లు మామిడి పండ్లు తినొచ్చా..?

ఇండియాలో లక్షల సంఖ్యలో ప్రజలు దీర్ఘకాలిక డయాబెటిస్​తో బాధపడుతున్నారు.  టైప్ 1డయాబెటిస్​ ఆటో ఇమ్యూన్​ రియాక్షన్​ వల్ల, టైప్​ 2 డయాబెటిస్​ జీవనశైలి అలవాట్ల వల్ల వస్తుంది. షుగర్​ వచ్చిందని తెలియగానే చాలా మంది హైరానా పడిపోతారు. అలా కాకుండా తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే షుగర్​ ఎప్పటికీ కంట్రోల్​ లో ఉంటుంది. తినే ఆహారం విషయంలో కూడా చాలా మందికి రకరకాల  అనుమానాలు ఉన్నాయి. ఈ సమ్మర్​లో విరివిగా దొరికే మామిడి పండ్లు తినవచ్చా.. లేదా అనే అనుమానం కూడా ఎంతో మంది షుగర్​ పేషెంట్లలో ఉంటుంది. 

మితంగా తీసుకుంటే మంచిదే

గ్లైసెమిక్​ ఇండెక్స్​ తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవడం షుగర్​ పేషెంట్లకు మంచిది. కొన్ని రకాల పండ్లు తీసుకోవడానికి ఒకటికి  రెండు సార్లు ఆలోచిస్తాం. అదే సంశయం మామిడి పండు విషయంలోనూ ఉంటుంది. వేసవిలో దొరికే ఈ పండు చాలా మంచిది. వీటిల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులు దీనిని తినవద్దని అనుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మామిడి పండ్లను మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ కార్బోహైడ్రేట్స్​ఉంటాయని, అందుకే మామిడి పండ్లను మితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించగలవని డాక్టర్లు చెబుతున్నారు.