మొన్న ఢిల్లీ, ఇవాళ బెంగళూరు రేపు హైదరాబాద్ .. మెట్రోలోనూ మందు తీసుకెళ్లొచ్చా?!

మొన్న ఢిల్లీ, ఇవాళ బెంగళూరు రేపు హైదరాబాద్ .. మెట్రోలోనూ మందు తీసుకెళ్లొచ్చా?!

మెట్రో జర్నీ.. ఇందులో ఎలాంటి మందు బాటిళ్లు.. ఆల్కాహాల్ తీసుకెళ్లటానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో రైళ్లలోనూ ఇదే విధానం అమలు అవుతుంది. రీసెంట్ గా.. మొన్నటికి మొన్న ఢిల్లీ మెట్రో ఓ ప్రకటన చేసింది. ఢిల్లీ మెట్రోలో రెండు లిక్కర్ బాటిళ్లు తీసుకెళ్లవచ్చు.. అవి సీల్ ఓపెన్ చేయకుండా ఉండాలి. సీల్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం అనుమతి లేదు అని ప్రకటించింది ఢిల్లీ మెట్రో. 

ఇప్పుడు ఇదే బాటలో బెంగళూరు ఆలోచిస్తుంది. బెంగళూరు మెట్రోలోనూ లిక్కర్ బాటిళ్లతో జర్నీ చేసే విధంగా నిబంధనలను సవరించటానికి రెడీ అయ్యింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీ, బెంగళూరు మెట్రోలో లిక్కర్ అనుమతి వచ్చినట్లే..ఇదే అంశంపై.. హైదరాబాద్ మెట్రో లో ఉందా లేదా అనే ప్రశ్న నెటిజన్ల నుంచి తలెత్తుతుంది. ఆయా రాష్ట్రాల్లోని మెట్రోలో లిక్కర్ అనుమతి ఇస్తున్నారు.. హైదరాబాద్ మెట్రోలో కూడా రెండు లిక్కర్ బాటిళ్లు తీసుకెళ్లే విధంగా ఎందుకు నిబంధనలు సవరించకూడదు అంటూ ప్రశ్నిస్తున్నారు మెట్రో జర్నీ ప్రయాణికులు.

ALSO READ:జై జై OTT : బయట రూ.60 పెప్సీ.. మల్టీఫ్లెక్స్ లో రూ.360

నిన్నటికి నిన్న హైదరాబాద్ మెట్రో స్టూడెంట్ పాస్ తీసుకొచ్చింది. 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లిస్తే.. 30 ట్రిప్పులు జర్నీ చేయొచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే ఫుల్ రష్ తో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో.. స్టూడెంట్స్ పాస్ తో మరింత జోష్ రానుంది. రద్దీ పెరగనుంది. దీనికితోడు రెండు లిక్కర్ బాటిళ్లతో జర్నీకి కూడా అనుమతి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతుంది. 

ఢిల్లీ, బెంగళూరు మెట్రో వార్తలు చూసిన తర్వాత.. హైదరాబాద్ మెట్రోలోనూ రేపో.. మాపో లిక్కర్ కు అనుమతి రావొచ్చని భావిస్తున్నారు ప్రయాణికులు.  దీనిపై హైదరాబాద్ మెట్రో ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం లేకపోలేదు.