షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటే తేనె వాడొచ్చా..?

షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటే తేనె వాడొచ్చా..?

డయాబెటిస్ ఉన్నవాళ్లు టీ, కాఫీలలో షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బదులుగా తేనె కలుపుకోవచ్చు అని చాలామంది నమ్ముతారు. తేనే వాడితే షుగర్ లెవెల్స్ పెరగవు అనే మాట సరైంది కాదు. నిజానికి తేనెకీ షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీ పెద్దగా తేడా లేదు. ఇవి రెండూ బ్లడ్ షుగర్ లెవెల్స్​ని  ఎఫెక్ట్ చేస్తాయి. అయితే, చక్కెర కంటే తేనె ఎక్కువ తియ్యగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తేనె కలిపితే సరిపోతుంది. దీనివల్ల లోపలికి వెళ్లే షుగర్ కంటెంట్ తగ్గుతుంది అంతే.

తేనెకి పంచదార అంత రిఫైండ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి చక్కెర వాడాల్సి వచ్చినప్పుడు తేనె ఒక ఆల్టర్నేటివ్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంది. అంతే తప్ప తేనె వల్ల షుగర్ పెరగకుండా మాత్రం ఉండదు. సో..! డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ కంటే తేనె మంచిదే అనుకోవటానికి వీల్లేదు. టీ కాఫీలలో ఎక్కువ మోతాదు తేనె వేసుకునే అలవాటు ఉంటే వెంటనే తగ్గించుకోవటం మంచిది.

తేనెకీ చక్కెరకీ న్యూట్రిషన్​ ప్రొఫైల్ ఒక్కటే. కాకపోతే తేనెలో షుగర్ కంటే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫిట్​నెస్ ఫ్రీక్స్​కి తేనె వాడటం మంచిదే కానీ, డయాబెటిక్స్ మాత్రం తేనెకి కూడా దూరంగా ఉండాల్సిందే చక్కెర బదులు తేనె వాడమని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. కానీ, ఆ సలహా డయాబెటిక్ పేషెంట్స్‌‌‌‌‌‌‌‌ కోసం కాదు.