ఇప్పుడు హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు కొనొచ్చా!

ఇప్పుడు  హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు కొనొచ్చా!

న్యూఢిల్లీ: హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు గత రెండు సెషన్లలోనే 11 శాతం క్రాష్ అయ్యాయి. టాప్ మ్యూచువల్ ఫండ్స్‌‌కు సైతం భారీ నష్టాలను తెచ్చి పెట్టాయి.  ఈ రెండు సెషన్లలోనే హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ ఇన్వెస్టర్లకు రూ.1.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది.  ఇలాంటి టైమ్‌‌లో ఈ బ్యాంక్ షేర్లను కొనుక్కోవచ్చా? ఇంకా వెయిట్ చేస్తే బాగుంటుందా? ఇలాంటి  డౌట్స్‌‌ ఇన్వెస్టర్లకు ఉండడం సహజం. ఇండిపెండెంట్‌‌ మార్కెట్ ఎనలిస్ట్ ఆనంద్‌‌ టాండన్ మాత్రం హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లను కొనుక్కోవడం మంచిదేనని  సలహా ఇస్తున్నారు. ‘బ్యాంక్ షేర్లు పడకముందు కూడా  10 శాతం   పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిది 15–17 శాతానికి పెరిగింది. ఈ షేరును కొనకపోవడానికి ఎటువంటి కారణాలు లేవు.  

ముఖ్యంగా బుల్లిష్ వ్యూ ఉన్నవాళ్లు.  మార్కెట్ మొత్తం పడుతుందనే ఆలోచన ఉంటే అది వేరే విషయం. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ వంటి షేర్లు ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలో కీలకంగా ఉండాలి. ఇలాంటి షేర్లు మార్జిన్‌‌కు (తక్కువకు) దొరికనప్పుడు కొనుక్కోవడం బెటర్‌‌‌‌’ అని వివరించారు.  డిపాజిట్లు మార్కెట్ అంచనా వేసిన దాని కంటే నెమ్మదిగా పెరుగుతున్నాయని, అయినప్పటికీ  క్రెడిట్ గ్రోత్ మాత్రం బాగుందని వెల్లడించారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 50 బేసిస్ పాయింట్లు పడుతుందని  మేనేజ్‌‌మెంట్ ముందుగానే ఊహించిందని చెప్పారు. రానున్న క్వార్టర్లలో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తుందని అంచనా వేశారు. 

బ్రోకరేజ్‌‌లు పాజిటివ్‌‌గా..

హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లపై గ్లోబల్ బ్రోకరేజ్‌‌ కంపెనీ సీఎల్‌‌ఎస్‌‌ఏ పాజిటివ్‌‌గా ఉంది. బ్యాంక్ షేర్ల టార్గెట్ ధరను గతంలో వేసిన అంచనా రూ.1,900  నుంచి రూ.2,025 కి, యాక్సిస్ సెక్యూరిటీస్‌‌ రూ.1,800 నుంచి రూ.1,975 కి పెంచింది. బ్యాంక్ వాల్యుయేషన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని  ఫండ్‌‌ మేనేజర్‌‌‌‌ సౌరభ్‌‌ ముఖర్జీ చెబుతున్నారు. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు గురువారం 3 శాతం తగ్గి రూ.1,490 దగ్గర క్లోజయ్యాయి. బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నాయని, ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వీటిని కొనడం ప్రారంభిస్తారని ముఖర్జీ అన్నారు. ‘ బ్యాంక్ డిపాజిట్ల గ్రోత్ అంచనా వేసిన దాని కంటే తక్కువగా ఉందని కొంత  మంది ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ సమస్య కూడా పోతుందని నమ్ముతున్నాను. బ్యాంక్  మంచి పొజిషన్‌‌లో ఉంది.  డిపాజిట్ గ్రోత్ అంచనాల కంటే తక్కువ ఉన్నా, పెరిగింది. గత 20 ఏళ్ల సగటు  ప్రైస్‌‌ బుక్ రేషియో కంటే తక్కువకు హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ షేర్లు ట్రేడవుతున్నాయి’ అని వివరించారు. కాగా,  ఈ ఫండ్ మేనేజర్‌‌‌‌ నడుపుతున్న  మార్సెల్లస్‌‌  హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది.  

కోటక్‌‌ ఇన్‌‌స్టిట్యూషనల్ ఈక్విటీస్‌‌ ఎనలిస్టులు కూడా హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ వాల్యుయేషన్స్ బాగున్నాయని ఒప్పుకుంటున్నారు. ‘ మంచి రిటర్న్స్‌‌ ఇవ్వడానికి  బ్యాంక్‌‌కు కొంత టైమ్‌‌ కావాలి. ఇండస్ట్రీ కంటే బ్యాంక్ లోన్ గ్రోత్‌‌ కొద్దిగా బాగుంది. బ్యాంక్ ప్రాఫిట్స్ గ్రోత్‌‌ను బట్టి ఇన్వెస్ట్‌‌మెంట్ నిర్ణయాలు తీసుకోలేం’ అని ఈ బ్రోకరేజ్  పేర్కొంది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ షేర్లపై టార్గెట్ ధరను రూ.1,860 నుంచి రూ.1,800 కి తగ్గించింది. ‘హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ రిజల్ట్స్‌‌ కొద్దిగానే బలహీనంగా ఉన్నాయి. బ్యాంక్ ట్రాన్సిషన్‌‌ పీరియడ్‌‌ (మెర్జింగ్ పీరియడ్‌‌) లో ఉంది. రిటైల్‌‌, ఎస్‌‌ఎంఈ వంటీ ఎక్కువ మార్జిన్స్ ఇచ్చే లోన్ల  గ్రోత్ పెరగాలి. ఈ ప్రాసెస్‌‌కు టైమ్‌‌ పడుతుంది. అందువలన రానున్న క్వార్టర్లలో లోన్ గ్రోత్ పెరుగుతుంది’ అని సీనియర్‌‌‌‌ ఎనలిస్ట్ చక్రీ లోకప్రియా పేర్కొన్నారు.