హైదరాబాద్లో బ్లాక్​బెర్రీ ఆఫీస్​ షురూ

హైదరాబాద్లో  బ్లాక్​బెర్రీ ఆఫీస్​ షురూ

హైదరాబాద్, వెలుగు:కెనడా కేంద్రంగా పనిచేసే బ్లాక్‌‌బెర్రీ లిమిటెడ్ హైదరాబాద్‌‌లో కొత్త ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్’ను బుధవారం ప్రారంభించింది. ఐఓటీ పరిశ్రమల కోసం మిషన్ -క్రిటికల్ ఎంబెడెడ్ సాఫ్ట్‌‌వేర్​ను అభివృద్ధి చేయడానికి దీనిని ప్రారంభించారు. ఈ కొత్త సెంటర్​ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తోంది.

బ్లాక్​బెర్రీ క్యూఎన్​ఎక్స్​ గ్లోబల్ డెవలపర్ నెట్‌‌వర్క్ కోసం ఆసియా పసిఫిక్ హబ్‌‌ను ఇది సృష్టిస్తుంది.  ఎంబడెడ్​ సాఫ్ట్​వేర్​ సొల్యూషన్స్​, సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్​ను ఈ సెంటర్​ తీర్చుతుందని కంపెనీ తెలిపింది. కెనడా తరువాత తమకు అతిపెద్ద సెంటర్​ హైదరాబాద్​ ఆఫీసేనని తెలిపింది.