OTP ఎంటర్ చేస్తేనే ATM నుంచి నగదు 

OTP ఎంటర్ చేస్తేనే ATM నుంచి నగదు 

ఆన్ లైన్ షాపింగ్ చేయాలంటే ముందుగా OTP వస్తుంది. అది కన్ఫాం చేస్తేనే నగదు లావాదేవీలు జరుగుతాయి. మనం బుక్ చేసుకున్న వస్తువు కొనుగోలు జరిగినట్లు మెసేజ్ వస్తుంది. ATM లో అయితే నగదు విత్ డ్రా చేసినా..డబ్బులు వేసినా ఆ తర్వాత రిజిస్టరైన మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. అయితే కెనరా బ్యాంకు ATM నుంచి డబ్బులు విత్ చేసుకోవాలంటే మితగా బ్యాంకు  ATM లా కాకుండా ముందుగానే OTPని ఎంటర్‌ చేయాల్సిందే. ఇది  రోజులో రూ.10 వేల రూపాయల ఆ పై మొత్తాలకే ఈ OTP నిబంధన వర్తిస్తుంది. ఈ నిబంధనతో కెనరా బ్యాంకు ఏటీఎంలలో మనీ విత్ డ్రా మరింత సేఫ్ అంటున్నారు ఆ బ్యాంకు ఉన్నతాధికారులు. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్‌ డ్రాయల్స్‌ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా ఈ నిబంధనతో చెక్ పెట్టవచ్చని తెలిపారు కెనరా బ్యాంకు అధికారులు.