బక్రీద్‌కు సడలింపులా?.. ఐఎంఏ సీరియస్

బక్రీద్‌కు సడలింపులా?.. ఐఎంఏ సీరియస్

న్యూఢిల్లీ: బక్రీద్ (ఈద్ అల్ అదా) పండుగ కోసం కేరళ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించడం వివాదాస్పదం అవుతోంది. బక్రీద్ కోసం మూడ్రోజుల పాటు కరోనా నిబంధనలను సడలించడం ఏంటంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా కరోనా రూల్స్‌ను సడలించడంపై సీరియస్ అయ్యింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కరోనా రూల్స్‌ను ఎలా సడలిస్తారంటూ ఐఎంఏ కేరళ సర్కారును ప్రశ్నించింది.

కేరళ ప్రభుత్వం తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే సుప్రీం కోర్డుకు వెళ్తామని ఐఎంఏ హెచ్చరించింది. కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న టైమ్‌లో కొవిడ్ రూల్స్‌ను సడలించాలన్న సర్కారు నిర్ణయం దురదృష్టకరమని మండిపడింది. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తమ సంప్రదాయ, ప్రముఖ పండుగలు, తీర్థ యాత్రలను నిలిపివేశాయని పేర్కొంది. ఇలాంటి సమయంలో అక్షరాస్యతలో ముందున్న కేరళ తీసుకున్న నిర్ణయం సరికాదని ఐఎంఏ ఓ ప్రకటనలో వివరించింది.