తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాపై అనర్హత వేటు!

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాపై అనర్హత వేటు!

న్యూఢిల్లీ :  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాను డిస్ క్వాలిఫై చేయాలని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో అదానీ, మోదీని లక్ష్యంగా చేసుకుని మహువా లోక్ సభలో ప్రశ్నలు అడిగారని.. అందుకు  వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి డబ్బులు, గిఫ్టులు తీసుకున్నా రని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. మహువా పై వచ్చిన ఆరోపణలను పరిశీలించిన ఎథిక్స్ కమిటీ.. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని తాజాగా రికమండ్ చేసినట్టు సమాచారం. మహువా, హీరానం దాని మధ్య జరిగిన ట్రన్సాక్షన్స్ ను పరిశీలించాలని కమిటీ చెప్పినట్టు సమాచారం. ఈ కమిటీ రూపొందించిన ఫైనల్ రిపోర్టును గురువారం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది