450 ఎంబీబీఎస్.. 150 పీజీ సీట్ల రద్దు

450  ఎంబీబీఎస్.. 150 పీజీ సీట్ల రద్దు
  • లిస్ట్‌‌లో ఎంఎన్‌‌ఆర్‌‌‌‌, మహావీర్‌‌‌‌, టీఆర్‌‌‌‌ఆర్‌‌‌‌
  • ఇటీవలే పూర్తయిన ఎంబీబీఎస్, పీజీ అడ్మిషన్లు
  • ఆందోళనలో 600 మంది స్టూడెంట్లు
  • రెండేండ్లు వృథా అవుతాయని ఆవేదన

హైదరాబాద్ : రాష్ట్రంలోని మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలపై నేషనల్ మెడికల్ కమిషన్ వేటు వేసింది. సంగారెడ్డిలోని ఎంఎన్‌‌ఆర్ మెడికల్ కాలేజీ, పటాన్‌‌చెరులోని టీఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ మెడికల్ కాలేజీ, వికారాబాద్‌‌లోని మహావీర్ మెడికల్ కాలేజీల పర్మిషన్​ను రద్దు చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో ఎన్‌‌ఎంసీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేశాయి. ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని 4 ప్రైవేటు కాలేజీల్లో ఈ ఏడాది మార్చి 30న తనిఖీలు చేపట్టాయి. ఈ బృందాల సూచన మేరకు 3 కాలేజీల పర్మిషన్‌‌ రద్దు చేయాలని ఎన్‌‌ఎంసీ నిర్ణయించింది. ఆయా కాలేజీల 2021–-22 అకడమిక్ ఇయర్‌‌‌‌ పర్మిషన్  రద్దు చేస్తున్నట్టు ఈ నెల రెండో వారంలో కాలేజీల యాజమాన్యాలకు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్‌‌ఎంసీ సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని కాళోజీ వర్సిటీ, కాలేజీల యాజమాన్యాలు ఇన్నాళ్లు గోప్యంగా ఉంచినప్పటికీ, ఎన్‌‌ఎంసీ తాజాగా తన వెబ్‌‌సైట్‌‌లో పెట్టడంతో విషయం బయటపడింది. దీంతో ఇటీవల జరిగిన కౌన్సెలింగ్‌‌లో ఆయా కాలేజీల్లో చేరిన ఎంబీబీఎస్‌‌ స్టూడెంట్లు, పీజీ స్టూడెంట్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ 3 కాలేజీల్లో కలిపి 450 మంది ఎంబీబీఎస్‌‌ స్టూడెంట్లు, 150  మంది పీజీ స్టూడెంట్లు ఉన్నారు. అడ్మిషన్లు పూర్తయ్యాక పర్మిషన్లు రద్దు చేస్తే తమ భవిష్యత్ ఏంటని వీళ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 


మెడికల్ కాలేజీల్లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ఏటా తనిఖీలు :-
మెడికల్ కాలేజీల్లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ఏటా తనిఖీలు చేపడుతుంది. కాలేజీల పర్మిషన్ రెన్యువల్ లేదా రద్దు చేయడాన్ని అడ్మిషన్లకు ముందే ప్రకటిస్తుంది. సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఆదేశాలతో ఈసారి ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీజీ కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నప్పుడే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొన్ని కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేశాయి. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ నిబంధనల మేరకు మెడికల్ ప్రొఫెసర్లు లేకపోవడం, ల్యాబులు సక్కగా లేకపోవడం, కాలేజీలకు అనుబంధంగా ఉన్న దవాఖాన్లలో పేషెంట్లు అసలే లేకపోవడం వంటి కారణాలతో పలు కాలేజీల పర్మిషన్లను రద్దు చేశారు. గత నెల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవగా, ఈ నెల సెకండ్ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాలేజీల పర్మిషన్లు రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. 

 

రెండేండ్లు వృథా!
ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ నిర్ణయంతో స్టూడెంట్ల భవిష్యత్ ఎటూగాకుండా పోయింది. అడ్మిషన్లకు ముందే కాలేజీల పర్మిషన్లు రద్దు చేసి ఉంటే.. వేరే కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఉండేది. 2022–23 అకాడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన నీట్ పీజీ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పూర్తయిపోయింది. ఈ నెల 20తో నీట్ యూజీకి సంబంధించిన అప్లికేషన్ గడువూ ముగిసిపోయింది. అంటే, ఇంకో అకాడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ వీళ్లకు ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీజీ చదివే చాన్స్ లేదు. రాష్ట్రంలో 4 కాలేజీల్లో తనిఖీలు జరిగితే 3 కాలేజీల పర్మిషన్ రద్దు అయిందంటే, మెడికల్ కాలేజీల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు కాలేజీలన్నీ థంబ్ టీచర్లను, థంబ్ ఫాకల్టీని పెట్టి మేనేజ్ చేస్తున్నాయి. కాలేజీల అనుబంధ దవాఖాన్లకు పేషెంట్లు రాకపోవడంతో, ఎంబీబీఎస్, పీజీ స్టూడెంట్లకు ప్రాక్టీస్ చేసే చాన్స్ ఉండట్లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు పేషెంట్ల సమస్య లేనప్పటికీ, ఫ్యాకల్టీ సమస్య ఉంది. 1300లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గైనకాలజీ ప్రొఫెసర్ పోస్టులు 50 ఉండగా, అందులో 40 ఖాళీగానే ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 70కి.. 40 ఖాళీగానే ఉన్నయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 300లకు, 135 ఖాళీగా ఉన్నాయి. ఈ స్థాయిలో ఖాళీలు ఉంటే పీజీ, యూజీ సీట్లలో ఎంన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కోతలు పెట్టే చాన్స్ ఉంటుంది. కానీ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ తనిఖీలపుడు  ఇక్కడోళ్లను అక్కడికి, అక్కడోళ్లను ఇక్కడికి పంపించి మెడికల్ ఎడ్యుకేషన్ ఆపీసర్లు మేనేజ్ చేస్తున్నారు. దీనిపై ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీకి ఫిర్యాదు చేస్తామని గతంలో కొంత మంది డాక్టర్లు హెచ్చరించారు. అదే జరిగితే ప్రభుత్వ మెడికల్ కాలేజీల పర్మిషన్లు రద్దయ్యే  ప్రమాదం ఉంది.

 

కోర్టుకు పోతం :-
ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీకి, కాళోజీ వర్సిటీకి, కాలేజీలకు నడుమ మా జీవితాలు నలిగిపోతున్నాయి. అడ్మిషన్లు పూర్తవకముందు చేయాల్సిన పని, అడ్మిషన్ల తర్వాత చేస్తే మేమంతా ఏడ పోవాలె? కాలేజీల యాజమాన్యాలను అడిగితే మా తప్పు లేదంటున్నాయి. మరి ఇది ఎవరి తప్పు? అందుకే కోర్టులోనే తేల్చుకుందామని నిర్ణయించుకున్నామని ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం : -

ఫలించిన వరంగల్ రైతుల ఉద్యమం


స్వీపర్‌‌‌‌‌‌‌‌ కొడుకు.. ఇక కలెక్టర్