హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశాఖలో వర్క్ ఆర్డర్లు, డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు, నర్సులతో సహా అన్ని కేడర్ల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఒరిజినల్ పోస్టింగ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సర్కార్ ఆదేశాలతో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తమ పరిధిలో పనిచేస్తున్న హాస్పిటళ్ల సూపరింటెండెంట్లకు, డీఎంహెచ్‌వోలకు సర్క్యులర్ జారీ చేశారు.
కొత్తగా డిప్యుటేషన్లు ఇవ్వాలంటే, ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిప్యుటేషన్ల రద్దును ప్రభుత్వ డాక్టర్ల సంఘం స్వాగతించింది
