నర్సింగ్‌‌ మెరిట్‌‌ లిస్ట్‌‌పై అభ్యంతరాలు ఉంటే చెప్పండి: మెడికల్ బోర్డు

నర్సింగ్‌‌ మెరిట్‌‌ లిస్ట్‌‌పై అభ్యంతరాలు ఉంటే చెప్పండి:  మెడికల్ బోర్డు

హైదరాబాద్, వెలుగు : స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్‌‌ లిస్ట్‌‌పై అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఫిర్యాదు చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు అభ్యర్థులకు సూచించింది. 

తమకు అందిన ఫిర్యాదులను, అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 17లోగా క్లారిటీ ఇస్తామని తెలిపింది. ఒకవేళ ఎవరికైనా అర్హత ఉండి, మెరిట్‌‌ లిస్టులో చోటు దక్కకపోతే, వారి పేరును మెరిట్‌‌ లిస్టులోకి చేర్చి, సర్టిఫికెట్లను వెరిఫై చేస్తామని పేర్కొంది.