వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయం

వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా ఎక్కువవుతోంది. తాజాగా ఇది 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో భారత్ లో 2.58 లక్షల మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా ఆదివారం 358 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మాస్కులు వేసుకోవడం, వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయబోమని కేంద్ర సర్కారు స్పష్టం చేసింది.

వ్యాక్సిన్ తీసుకునే వారి అనుమతి తీసుకున్నాకే.. వారికి వ్యాక్సినేషన్ చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, దివ్యాంగులకు టీకా కార్యక్రమంపై ఓ ఎన్జీవో ఫౌండేషన్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం పైవ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయబోమని, ప్రజలు తమకు నచ్చితేనే టీకా వేయించుకోవాలని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. 

మరిన్ని వార్తల కోసం: 

భారత్ను నడిపించే సత్తా పంత్ సొంతం

ఖబడ్దార్ జీవన్ రెడ్డి.. టీఆర్ఎస్ సర్పంచ్ భర్త వార్నింగ్

ఇండియన్ల టాప్ డెస్టినేషన్ గా గోవా