ఇండియన్ల టాప్ డెస్టినేషన్ గా గోవా

ఇండియన్ల టాప్ డెస్టినేషన్ గా గోవా
  • ఇండియన్ల 2022 బకెట్ లిస్టులో టాప్ డెస్టినేషన్ గా గోవా
  • తర్వాతి ప్లేస్ లో మనాలి, షిమ్లా, కేరళ
  • ఇంటర్నేషనల్ టాప్ డెస్టినేషన్లలో బాలి, దుబాయ్..
  • వెల్లడించిన ఓయో ట్రావెల్ పిడియా సర్వే

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్నా, ట్రావెల్ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.  ఓయో విడుదల చేసిన యాన్యువల్ కన్జూమర్ సర్వే ప్రకారం, గోవా వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ఈ సర్వేలో మొత్తం 3,000 మంది పాల్గొనగా, మూడో వంతు మంది గోవా తమ బకెట్‌‌‌‌ లిస్టు (ట్రావెల్ లిస్ట్‌) లో టాప్‌‌‌‌లో ఉందని చెప్పారు. కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఓయో ఈ సర్వేను చేసింది. ట్రావెల్‌‌‌‌పిడియా పేరుతో ఈ సర్వేను రిలీజ్ చేసింది. ఈ సర్వే కోసం కేవలం ఇండియాలోనే కాకుండా ఓయోకి కీలకంగా ఉన్న ఇండోనేషియా, యూరప్‌‌‌‌ వంటి మార్కెట్లలోని రెస్పాండెంట్ల అభిప్రాయాలను కూడా  కంపెనీ సేకరించింది. ఈ సర్వే ప్రకారం,  61 శాతం మంది ఇండియన్స్‌‌‌‌ లోకల్‌‌‌‌గా  ట్రావెల్ చేయాలనుకుంటున్నారు.  25 శాతం మంది ఈ ఏడాది ఇంటర్నేషనల్‌‌‌‌తో పాటు, డొమెస్టిక్‌‌‌‌గా ట్రిప్‌‌‌‌లు వేయాలనుకుంటున్నారు. ట్రావెల్‌‌‌‌ చేయడానికి ఆసక్తి ఉన్నప్పటికీ, 80 శాతం మంది కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారని ఈ సర్వే వెల్లడించింది. కానీ, బూస్టర్ డోస్‌‌‌‌ అందుబాటులోకి రావడంతో కొంత రిలీఫ్‌‌‌‌గా అనిపిస్తోందని చెప్పారు.  ఫేవరేట్‌‌‌‌ డెస్టినేషన్ల పరంగా చూస్తే,ఈ ఏడాది తమ బకెట్ లిస్ట్‌‌‌‌లో గోవా టాప్‌‌‌‌ డెస్టినేషన్‌‌‌‌గా ఉందని చెప్పారు. దీని తర్వాత మనాలి, దుబాయ్‌‌‌‌, షిమ్లా, కేరళలు ఇండియన్ల టాప్‌‌‌‌ డెస్టినేషన్లుగా ఉన్నాయని ఓయో పేర్కొంది. ఇంటర్నేషనల్ డెస్టినేషన్లలో దుబాయ్‌‌‌‌తో పాటు మాల్దీవ్‌‌‌‌లు, పారిస్‌‌‌‌, బాలి, స్విట్జర్లాండ్‌‌‌‌ వంటి డెస్టినేషన్లు ఈ ఏడాది ఇండియన్ల బకెట్ లిస్టులో ఉన్నాయని ఓయో 
ట్రావెల్‌పిడియా వెల్లడించింది. 

స్పౌజ్‌‌‌‌తో వెళ్లేందుకు..
ట్రావెల్‌‌‌‌ ఎవరితో చేయాలనే అంశంపై 37 శాతం మంది స్పౌజ్‌‌‌‌ (భార్య లేదా భర్త) తో కలిసి వెళ్తామని చెప్పారు. మరో 19 శాతం మంది క్లోజ్ ఫ్రెండ్స్‌‌‌‌తో ట్రావెల్ చేస్తామని చెప్పగా, 16 శాతం మంది ఫ్యామిలీతో కలిసి వెళతామని చెప్పారు. మరో 12 శాతం మంది సోలో బ్యాక్‌‌‌‌ప్యాకింగ్‌‌‌‌కు ఎక్కువ ఆసక్తి చూపించారు.  16 శాతం మంది మాత్రం స్పౌజ్‌‌‌‌తో నైనా, ఫ్యామిలీతోనైనా, ఫ్రెండ్స్‌‌‌‌తోనైనా, సోలోగానైనా వెళ్లడానికి ఓకే అన్నారు. ఓయో ట్రావెల్‌‌‌‌పిడియా ప్రకారం, ఇండోనేషియాలో టాప్‌‌‌‌ డెస్టినేషన్‌‌‌‌గా బాలి నిలిచింది. యూరప్‌‌‌‌లో బాల్టిక్ సముద్రంలోని డానిష్‌‌‌‌ ఐలాండ్‌‌‌‌ బోర్న్‌‌‌‌హోమ్‌‌‌‌కు వెళ్లేందుకు అక్కడి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపించారని ఓయో ప్రకటించింది.  ఈ సర్వే ప్రకారం, నెదర్లాండ్‌‌‌‌లోని మెజార్టీ ప్రజలు ఈ ఏడాది ఆస్ట్రియాను చూడాలనుకుంటున్నారు.