భారత్ను నడిపించే సత్తా పంత్ సొంతం

భారత్ను నడిపించే సత్తా పంత్ సొంతం

న్యూఢిల్లీ: దేశమంతా పండుగ మూడ్ లో ఉన్న టైమ్ లో టీమిండియా సూపర్ స్టార్, కింగ్ కోహ్లీ శనివారం రాత్రి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీని వదులుకొని షాకిచ్చాడు. సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ఓడిన 24 గంటల్లోనే లీడర్ గా తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇప్పటికే అతడు టీ20, వన్డే కెప్టెన్సీల నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ప్లేస్ లో భారత జట్టు టెస్టు పగ్గాలు ఎవరు చేపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ బ్యాట్స్ మన్ అజింక్యా రహానెతోపాటు సుదీర్ఘ ఫార్మాట్ లోనూ తానేంటో నిరూపించుకున్న కేఎల్ రాహుల్ ఈ రేసులో ఉన్నారు. అయితే వెటరన్ క్రికెటర్లు మాత్రం మరో క్రికెటర్ పేరు సూచిస్తున్నారు. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు టీమిండియా టెస్టు సారథ్యాన్ని అప్పజెప్పాలని లెజెండరీ బ్యాట్స్ మెన్ సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్ అంటున్నారు. 

టీమిండియా పగ్గాలు అప్పగిస్తే.. పంత్ బ్యాటింగ్ లోనూ మరింత మెరుగవుతాడని గవాస్కర్ సూచించాడు. అతడ్నే తదుపరి కెప్టెన్ గా చేయాలన్నాడు. చిన్న వయస్సులో కెప్టెన్ ను చేస్తే తప్పేంటన్నాడు. దిగ్గజ ప్లేయర్ టైగర్ పటౌడీని ఉదాహరణగా చెప్పిన ఆయన.. 21 ఏళ్ల వయస్సులోనే కెప్టెన్ గా బాధ్యతలను సమర్థంగా నెరవేర్చారని గుర్తు చేశారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా పంత్ బాగా రాణించాడని, అతడిలో భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం పుష్కలంగా ఉందని నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో యువీ అంగీకరించాడు. వికెట్ల వెనుక నుంచి ఆటను అర్థం చేసుకోవడం పంత్ కు కలిసొస్తుందని.. కెప్టెన్సీ బాధ్యతలను మోయడానికి అతడే సరైన ప్లేయర్ అని సూచించాడు. 

మరిన్ని వార్తల కోసం: 

 

వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయం

భారత్ను నడిపించే సత్తా పంత్ సొంతం

ఖబడ్దార్ జీవన్ రెడ్డి.. టీఆర్ఎస్ సర్పంచ్ భర్త వార్నింగ్