
11 కోట్ల కెనాన్ ఈఓఎస్ కెమెరాలు
గ్లోబల్‌గా 11 కోట్ల ఈఓఎస్ సిరీస్ ఇంటర్ చేంజబుల్ లెన్స్ (లెన్స్‌లు మార్చుకోగలిగే) కెమెరాలను తయారు చేశామని కెనాన్ ప్రకటించింది. అంతేకాకుండా ఆర్ఎఫ్/ఈఎఫ్ సిరీస్‌కు చెందిన ఇంటర్ చేంజబుల్ లెన్స్‌లను ఇప్పటి వరకు 16 కోట్లు తయారు చేశామని పేర్కొంది. ఈఓఎస్ ఆర్6 మార్క్2 కంపెనీ ఈఓఎస్ కెమెరాలలో 11 వ కోట్లది కాగా, ఆర్ఎఫ్ 100 ఎంఎం ఎఫ్ 2.8 మాక్రో ఇంటర్‌చేంజబుల్ లెన్స్ 16 వ కోట్లది.