
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో డీలర్లకు ప్యాసింజర్ వెహికల్ డిస్పాచ్‌లు 9శాతం తగ్గి 3,21,840 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 3,52,921 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ సియామ్ ప్రకారం, జీఎస్‌టీ తగ్గింపు అంచనాలతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేయడంతో కంపెనీలు సరఫరాలను తగ్గించాయి. అయితే, టూవీలర్ వాహనాల అమ్మకాలు 7 శాతం పెరిగి 18,33,921 యూనిట్లకు చేరాయి.
స్కూటర్ విక్రయాలు 13శాతం పెరిగి 6,83,397 యూనిట్లకు, మోటార్‌సైకిళ్లు సేల్స్ 4 శాతం పెరిగి 11,06,638 యూనిట్లకు పెరిగాయి. త్రీవీలర్ సేల్స్ 8శాతం పెరిగి ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 75,759 యూనిట్లకు ఎగిశాయి.