
మంచిర్యాల జిల్లా మైలారంలో విద్యార్థుల నిరసన
బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం హైస్కూల్ స్టూడెంట్స్ బుధవారం స్కూల్ మేనేజ్మెంట్చైర్మన్ భాస్కర్ ఇంటిని ముట్టడించారు. వెంటనే టాయిలెట్స్ కట్టించాలని ఇంటి ఎదుట బైఠాయించారు. బాలికలు మాట్లాడుతూ స్కూల్లో 207 మంది స్టూడెంట్స్ఉండగా, ఇందులో 100 మంది బాలికలం ఉన్నామన్నారు. గత ఎండాకాలం సెలవుల్లో కొత్త టాయిలెట్స్కడతామని పాత టాయిలెట్స్‌ను కూలగొట్టారన్నారు. ముగ్గు పోసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదని వాపోయారు. టాయిలెట్స్ లేక నీళ్లు తాగడం మానేశామన్నారు.
టాయిలెట్స్ కట్టించేంతవరకు నిరసన తెలుపుతామన్నారు. దీంతో చైర్మన్భాస్కర్ వారికి సర్ధి చెప్పి స్కూల్‌కు వెళ్లారు. ఆయన వెంటే పిల్లలంతా పాఠశాలకు వెళ్లారు. సమస్య పరిష్కరించకపోతే గ్రామపంచాయతీ ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ చైర్మన్‌కు వినతిపత్రం ఇచ్చి క్లాసులకు వెళ్లిపోయారు.