ప్రేమించుకున్నవాళ్లు తమ ప్రేమ కోసం ఏదైనా చేస్తారు. తమ ప్రేయసీ లేదా ప్రేమికుడిని కలవడం కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. ఇలాగే తన ప్రేయసిని ఎంతగానో ప్రేమించిన ఓ భగ్న ప్రేమికుడు.. ఆమెను కలవడం కోసం డైరెక్ట్‌గా ఆమె ఇంటికే ఓ సొరంగాన్ని తవ్వాడు. ఈ ఘటన మెక్సికోలో జరిగింది. మెక్సికోకు చెందిన ఆల్బెర్టో అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. కానీ, కొన్ని రోజుల క్రితం ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగిపోయింది. దాంతో తాపీ మేస్త్రీగా పనిచేసే యువకుడు.. ఎలాగైనా ఆమెను కలవాలనుకున్నాడు. కానీ, డైరెక్ట్‌గా ఆమె ఇంటికి వెళ్లలేని పరిస్థితి. దాంతో తీవ్ర ఆలోచనలో పడ్డ యువకుడు.. ఓ పక్కా ప్లాన్ వేశాడు. తాను ఉంటున్న ఇంటి నుంచి.. ప్రేయసి ఇంటికి సొరంగం తవ్వాడు. ఆ యువతి భర్త ఆఫీసుకు వెళ్లగానే.. యువకుడు సొరంగం ద్వారా యువతి ఇంట్లోకి ప్రవేశించేవాడు. ఇలా కొన్ని రోజులు సాగిన తర్వాత.. ఓ రోజు యువతి భర్త ఆఫీసు నుంచి తొందరగా ఇంటికొచ్చాడు. ఇంట్లో తన భార్యతో అల్బెర్టోను చూసి యువతి భర్త జార్జ్ షాక్ అయ్యాడు. అల్బెర్టోను పట్టుకునేలోపే అక్కడి నుంచి మాయమయ్యాడు. దాంతో జార్జ్ ఇల్లంతా వెతకగా.. సోఫా కింద ఒక పెద్ద సొరంగం బయటపడింది. ఆ సొరంగం గుండా వెళ్లి చూస్తే.. నేరుగా అల్బెర్టో ఇంటికి వెళ్లింది. అల్బెర్టో చేసిన పనికి జార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్బెర్టో తాపీమేస్త్రీ కావడంతో.. చాకచక్యంగా సొరంగం తవ్వాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్బెర్టో కోసం వెతుకుతున్నారు.
For More News..
కేసీఆర్‌కు ప్రైవేట్ యూనివర్సిటీలపై ప్రేమ పెరిగింది
ఓటమి తర్వాత కేసీఆర్ అహంకారం దారికొచ్చింది
కొడుకుల మీద కోపంతో కుక్క పేరు మీద ఆస్తి రిజిస్ట్రేషన్
