క్యాపరో గ్రూప్‌ అధినేత.. లార్డ్ స్వరాజ్ పాల్ కన్నుమూత

 క్యాపరో గ్రూప్‌ అధినేత.. లార్డ్ స్వరాజ్ పాల్ కన్నుమూత

న్యూఢిల్లీ: ఎన్​ఆర్​ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్‌‌లో కన్నుమూశారు. జలంధర్‌‌​లోని ఒక చిన్న ఫౌండ్రీ నుంచి 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్'లో రెగ్యులర్​గా చోటు సంపాదించే స్థాయికి ఎదిగారు.  1931లో జన్మించిన ఆయన విదేశాల్లో చదివారు. భారతదేశానికి తిరిగి వచ్చి కుటుంబ వ్యాపారం అయిన అపెక్ గ్రూప్‌‌లో చేరారు.  

1968లో లండన్‌‌లో క్యాపరో గ్రూప్‌‌ను స్థాపించారు. ప్రస్తుతం క్యాపరో వార్షిక టర్నోవర్ బిలియన్ డాలర్లకు పైగా ఉంది. తన కుమార్తె అంబిక మరణం తరువాత ఆమె పేరు మీద అంబిక పాల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పిల్లల విద్య, ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు.