
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో కొత్త రీజినల్ ఆఫీస్‌ను కాప్రి గ్లోబల్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రారంభించింది. క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు జైదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఆఫీస్‌తో దక్షిణ భారత దేశ మార్కెట్లలో ఎంట్రీ ఇస్తామని కాప్రి హోమ్ లోన్స్ బిజినెస్ హెడ్ మునీష్ జైన్ అన్నారు.
కరీంనగర్, వరంగల్‌లో రెండు శాఖలు ప్రారంభమయ్యాయని చెప్పారు. కాప్రి ఆఫీస్‌ను సోమాజిగూడలో 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.