3‑2తో ఘనాపై పోర్చుగల్‌‌ థ్రిల్లింగ్‌‌ విక్టరీ

3‑2తో ఘనాపై పోర్చుగల్‌‌ థ్రిల్లింగ్‌‌ విక్టరీ

దోహా: ఐదు వరల్డ్‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌లో గోల్స్‌‌‌‌ చేసిన తొలి ప్లేయర్‌‌‌‌గా కెప్టెన్‌‌‌‌ క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించిన వేళ ఖతార్‌‌‌‌ కప్పులో పోర్చుగల్‌‌‌‌ శుభారంభం చేసింది. రొనాల్డో సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌కు తోడు జావో ఫెలిక్స్‌‌‌‌, రఫెల్‌‌‌‌ లెయవో సత్తా చాటడంతో చిన్న జట్టు ఘనాపై రొనాల్డోసేన గట్టెక్కింది. గురువారం రాత్రి ఉత్కంఠగా సాగిన  గ్రూప్‌‌‌‌–హెచ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో పోర్చుగల్‌‌‌‌ 3–2తో ఘనాను ఓడించింది. సెకండాఫ్‌‌‌‌లో ఐదు గోల్స్‌‌‌‌ నమోదైన ఈ పోరులో  65వ నిమిషంలో పెనాల్టీకి  రొనాల్డో ఖాతా తెరవగా.. ఫెలిక్స్‌‌‌‌ (78వ నిమిషంలో), లెయవో (80వ ని.) చెరో గోల్‌‌‌‌ కొట్టారు. ఘనా తరఫున ఆండ్రీ అయెవ్‌‌‌‌ (73 వ. ని), ఒస్మాన్‌‌‌‌ బుకారి (89వ ని.) స్కోరు చేశారు. 

చివర్లో టెన్షన్‌‌‌‌ 

స్టార్టింగ్‌‌‌‌ నుంచే బాల్‌‌‌‌ను తమ కంట్రోల్‌‌‌‌లో ఉంచుకున్న పోర్చుగల్‌‌‌‌ వరుసగా దాడులు చేసింది. టీమ్‌‌‌‌ను ముందుండి నడిపించిన రొనాల్డో ప్రత్యర్థిపై ఎటాక్‌‌‌‌ చేశాడు.  పదో నిమిషంలోనే  రొనాల్డో కొట్టిన షాట్‌‌‌‌ను ఘనా కీపర్‌‌‌‌ లారెన్స్‌‌‌‌ జిగి నిలువరించాడు. మూడు నిమిషాల తర్వాత కార్నర్‌‌‌‌కు నెట్‌‌‌‌ వద్ద హెడ్డర్‌‌‌‌తో గోల్‌‌‌‌ చేసే ప్రయత్నం చేయగా.. బాల్‌‌‌‌ వైడ్‌‌‌‌గా వెళ్లింది. 31వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌‌‌‌కు రొనాల్డో బాల్‌‌‌‌ను నెట్‌‌‌‌లోకి పంపినా.. ఫౌల్‌‌‌‌ చేయడంతో రిఫరీ గోల్‌‌‌‌కు అనుమతించలేదు. ఇదే టైమ్‌‌‌‌లో ఘనాకు వరుసగా రెండు కార్నర్లు లభించినా.. పోర్చుగల్‌‌‌‌ వాటిని అడ్డుకుంది. ఫస్టాఫ్‌‌‌‌లో ఇరు జట్లూ గోల్‌‌‌‌ కొట్టలేకపోయాయి. సెకండాఫ్‌‌‌‌ మొదలవగానే ఆట మరింత రసవత్తరంగా మారింది. రొనాల్డోసేన ఘనా బాక్స్‌‌‌‌లోకి చొచ్చుకొచ్చింది. అదే టైమ్‌‌‌‌లో ఘనా కూడా దీటుగా స్పందించింది. ఈ క్రమంలో 63వ నిమిషంలో ఘనా బాక్స్‌‌‌‌లో ఆ దేశ ప్లేయర్‌‌‌‌ మొహమ్మద్‌‌‌‌ సలిసు.. రొనాల్డోను కింద పడేశాడు. రివ్యూ తర్వాత రిఫరీ పోర్చుగల్‌‌‌‌కు పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న రొనాల్డో సింపుల్‌‌‌‌గా గోల్‌‌‌‌ చేసి పోర్చుగల్‌‌‌‌ను 1–0తో లీడ్‌‌‌‌లోకి తెచ్చాడు. కానీ, పది నిమిషాలు తిరిగేలోపే ఘనా స్కోరు సమం చేసింది. 73వ నిమిషంలో ఆండ్రీ అయెవ్‌‌‌‌ నెట్‌‌‌‌ వద్ద తెలివిగా గోల్‌‌‌‌ చేసి ఘనా జట్టులో జోష్‌‌‌‌ నింపాడు. ఈ దశలో పోర్చుగల్‌‌‌‌ ఒక్కసారిగా గేరు మార్చింది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌‌‌‌ కొట్టింది. ఫెర్నాండెజ్‌‌‌‌ నుంచి బాల్‌‌‌‌ అందుకున్న జావో ఫెలిక్స్ ప్రత్యర్థి కీపర్‌‌‌‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌‌‌‌ చేశాడు. ఆ వెంటనే సబ్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ రఫేల్‌‌‌‌ లెయవొ మరో గోల్‌‌‌‌ అందించడంతో పోర్చుగల్ ఆధిక్యం 3–1కి పెరిగింది. ఆ జట్టు ఈజీగా గెలుస్తుందని అనుకుంటున్న టైమ్‌‌‌‌లో చివరి నిమిషంలో ఘనా ప్లేయర్‌‌‌‌ ఒస్మాన్‌‌‌‌ బాకురి 2–3తో తమ జట్టును రేసులోకి తెచ్చాడు. అడిషనల్‌‌‌‌ టైమ్‌‌‌‌ చివరి క్షణాల్లోనూ ఘనా స్కోరు సమం చేసినంత పని చేసి పోర్చుగల్​ను వణికించింది. 

  • 8   వరల్డ్‌‌కప్‌‌లో రొనాల్డోకు ఇది ఎనిమిదో గోల్‌‌. దాంతో, మెగా టోర్నీలో ఎక్కువ గోల్స్‌‌ చేసిన ప్లేయర్ల లిస్ట్‌‌లో అర్జెంటీనా స్టార్‌‌ లియోనల్‌‌ మెస్సీ (7)ని అధిగమించాడు. 
  • 2   37 ఏండ్ల 292 రోజుల రొనాల్డో వరల్డ్‌‌ కప్‌‌లో గోల్‌‌ చేసిన సెకండ్‌‌ ఓల్డెస్ట్‌‌ ప్లేయర్‌‌ గా నిలిచాడు. 1994లో కామెరూన్‌‌కు చెందిన రోజర్‌‌ మిలా 42 ఏండ్ల వయసులో గోల్‌‌ సాధించాడు.