
కరాచీ: వన్డే వరల్డ్ కప్‌లో చెత్తాట పాకిస్తాన్ జట్టును కుదిపేస్తోంది. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నాయకుడిగా దిగిపోయినా ప్లేయర్‌గా టీమ్‌తో పాటు కొనసాగుతానని తెలిపాడు. తన అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కు, టీమ్‌కు సపోర్ట్ ఇస్తానని చెప్పాడు. కాగా, పాక్ టీ20 కెప్టెన్‌గా పేసర్ షాహీన్ ఆఫ్రిదిని, టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్‌ను నియమిస్తున్నట్టు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.