హాలీవుడ్ స్థాయిలో ఆర్య 'కెప్టెన్'

హాలీవుడ్ స్థాయిలో ఆర్య 'కెప్టెన్'

కోలీవుడ్ స్టార్ ఆర్య కథానాయకుడిగా నటించిన సినిమా 'కెప్టెన్'. ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో యూత్ స్టార్ నితిన్ ఇవాళ ఈమూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. 'కెప్టెన్'లో ఆర్య ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు. ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. రెగ్యులర్ ఆర్మీ బేస్డ్ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఒక అడవిలో వింత జీవులను ఎదుర్కోవడానికి హీరో అండ్ టీమ్ వెళ్ళినప్పుడు ఏమైందనేది కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆర్య జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించారు. కాగా, ఆర్య, దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కలయికలో ఇది రెండో చిత్రం. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ 'టెడ్డీ' సినిమా చేశారు. 'కెప్టెన్' విషయానికి వస్తే... వినూత్న కథాంశంతో సినిమా రూపొందింది.

నటీనటులు: మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్యా మీనన్, సురేష్ మీనన్ తదితరులు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. మాధవన్
ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎస్. శివ కుమార్
సౌండ్ డిజైన్ : అరుణ్ శీను
సౌండ్ మిక్స్ : తపస్య నాయక్
కలరిస్ట్ : శివ శంకర్
వి, వీఎఫ్ఎక్స్‌ సూపర్ వైజర్ : వి. అరుణ్ రాజ్
కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలీ నూర్
స్టంట్ డైరెక్టర్ : ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్
ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.ఎస్. మూర్తి
ఎడిటర్ : ప్రదీప్ ఇ. రాఘవ్
సినిమాటోగ్రఫీ : ఎస్. యువ
మ్యూజిక్ : డి ఇమాన్
రచన - దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్