డ్రైవర్‎కు గుండెపోటు.. బ్రిడ్జిపై కారు బీభత్సం.. మహారాష్ట్రలో నలుగురు మృతి

డ్రైవర్‎కు గుండెపోటు.. బ్రిడ్జిపై కారు బీభత్సం.. మహారాష్ట్రలో నలుగురు మృతి

ముంబై: మహారాష్ట్రలోని థాణె జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అంబర్నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రిడ్జిపై వెళ్తున్న ఓ కారు.. కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు.సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో శివసేన తరఫున పోటీ చేస్తున్న కిరణ్ చౌబేదిగా గుర్తించారు. 

ఆయన తన డ్రైవర్ లక్ష్మణ్ షిండేతో కలిసి బువా పాడాలో ప్రచారానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. 
డ్రైవర్ షిండేతో పాటు నలుగురు మరణించారు. గాయపడిన వారు ప్రస్తుతం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు."కారు బ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌పైకి ఎక్కుతుంటే షిండేకు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. కాలు యాక్సిలరేటర్‌‌‌‌‌‌‌‌పై ఉండడంతో కంట్రోల్ తప్పి వాహనాలను ఢీ కొట్టింది" అని చౌబే పోలీసులకు వెల్లడించారు.