AP News: మహానంది వెళ్లి వస్తూ.. ఆరుగురి మృతి

AP News: మహానంది వెళ్లి వస్తూ.. ఆరుగురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ... కొమరోలు మండలం తాటిచెర్ల ముత్తు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.   ఈ ఘటనలో కారు.. లారీ ఢీకొనగా.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.  మరో  ఇద్దరికి గాయాలయ్యాయి.  క్షతగాత్రులను 108 వాహనంలో గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. 

ALSO READ | ఏపీలో కరోనా కలకలం.. కడప రిమ్స్‎లో పాజిటివ్ కేసు నమోదు..!

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  మృతులను బాపట్ల మండలం స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. బాపట్ల నుంచి మహానందికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.  ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇంకా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.