సిరియాలో బాంబ్ బ్లాస్ట్: 14మంది మృతి

సిరియాలో బాంబ్ బ్లాస్ట్: 14మంది మృతి

సిరియా మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిరియా-టర్కీ సరిహద్దు రాష్ట్రం అలెప్పోలోని, అజాజ్  నగరంలో ఈ ఘటన జరిగింది. రంజాన్  సందర్భంగా ఆదివారం సాయంత్రం మార్కెట్లన్నీ రద్దీగా ఉండడంతో.. సామాన్య ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కారులో అమర్చిన డిటోనేటర్లతో దుండగులు ఈ దాడికి పాల్పడ్డరని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందంటున్నారు పోలీసులు.