బీఎండబ్ల్యూ కారులో మంటలు

బీఎండబ్ల్యూ కారులో మంటలు

బషీర్ బాగ్, వెలుగు : కారులో మంటలు చెలరేగిన ఘటన సైఫాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన సంతోష్ కుమార్ తన బీఎండబ్ల్యూ కారును రెండ్రోజుల కిందట తెలిసిన వ్యక్తికి ఇచ్చాడు. అయితే, బుధవారం ఆ కారుతో డ్రైవర్ గోవింద్ రెడ్డి సెక్రటేరియట్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేశ్ వైపు వెళ్తున్నాడు. మింట్ కాంపౌండ్ వద్దకు రాగానే కారు ఇంజన్​లో నుంచి పొగ, మంటలు చెలరేగాయి. 

గోవింద్ రెడ్డి వెంటనే కారు పక్కకు ఆపి దిగిపోయాడు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు ముందు భాగం మంటల్లో కాలిపోయింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు.