అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు

 అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు

హైదరాబాద్ : హైటెక్ సిటీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నోవాటెల్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తుక్కుతుక్కైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిరువురూ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

నోవాటెల్ హోటల్ వైపు వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొడుతూ డివైడర్ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కారులోనే ఇరుక్కుపోయారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.