కారు ఆపమన్నందుకు కానిస్టేబుల్​పై దాడి

కారు ఆపమన్నందుకు కానిస్టేబుల్​పై దాడి

ఏపీలో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్ ను ఆపుతుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్​పైనే దాడి చేశాడు. నా కారునే అడ్డుకుంటావా అంటూ దౌర్జన్యం ప్రదర్శించాడు. అధిక వేగంతో వెళ్తున్న కారును ఆపేందుకు కానిస్టేబుల్ యత్నించగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పశ్చిగోదావరి జిల్లా  భీమవరం గునుపూడిలో ఈ ఘటన జరిగింది.

బొబ్బనపల్లి సంతోష్ అనే వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ గునుపూడిలో ఇద్దరిని గుద్దుకుంటూ వెళ్లాడు. వీరమ్మ పార్క్ సమీపంలో కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ సతీష్ కుమార్ పై దౌర్జన్యం చేశాడు కారు డ్రైవర్ సంతోష్. దాడితో కానిస్టేబుల్ కు మెడ, చేతిపై గాయాలయ్యాయి. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... సంతోష్ ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. సంతోష్ పై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించామన్నారు వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.