
దుండిగల్ దగ్గర ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ముందున్న కారును ఓవర్ టేక్ చేయబోయిన మరో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. రెండు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
దుండిగల్ పోలీస్ స్టేషర్ పరధిలోని మల్లంపేట్ దగ్గర ఔటర్ రింగు రోడ్డుపై ముందు వెళ్తున్నకారును ఓవర్ టేక్ చేయబోయిన మరో కారు పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న నర్సింహులు(35) అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.