
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వెహికల్‌ను పక్కకు తీయమని చెప్పిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారు ఓనర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామానికి చెందిన హసన్ కారును రోడ్డుకు అడ్డంగా నిలిపి ఉంచాడు.
గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎండీ ఫైజల్ కారును పక్కకు తీయాలని చెప్పగా, కోపంతో ఊగిపోయిన హసన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ దాడికి యత్నించాడు. కారు తాళం చెవి ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతికి తగలడంతో గాయమైంది. తోటి కానిస్టేబుళ్లు, స్థానికులు అతడిని వారించినా వినకుండా హంగామా చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.