ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు: ఆరు వెహికల్స్ డ్యాష్.. ఇద్దరికి సీరియస్‌

ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు: ఆరు వెహికల్స్ డ్యాష్.. ఇద్దరికి సీరియస్‌

దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కమ్మేసింది. ఓ వైపు చలికాలం మొదలు కావడం, మరో వైపు క్రాకర్స్‌ వల్ల ఇవాళ ఉదయం ఢిల్లీ దట్టమైన పొగతో నిండిపోయాయి. దీంతో గ్రేటర్ నోయిడా సమీపంలో ఢిల్లీ ఈస్ట్రన్ హైవే రోడ్డుపై కనీసం వెహికల్స్ కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రోజు ఉదయం వరుసగా ఆరు వెహికల్స్ ఒకదానికొకటి డ్యాష్ కొట్టుకున్నాయి. మొదట ఒక లారీని సడన్‌గా స్పీడ్‌గా వచ్చి ఒక కారు ఢీకొట్టింది. ఆ తర్వాత వెనుక వస్తున్న వాహనదారులకు ఇది కనిపించకపోడంతో వరుసగా ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గాయపడిన వారిని ఫరీదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. లారీని ఢీకొట్టిన కారులో ఉన్న  చందన్‌ కుమార్, అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వారి ఇద్దరి పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనలో రెండు లారీలు, ఒక షిఫ్ట్ కారు, ఒక ఇన్నోవా కారు, ఒక ఐ20 కారు ఒకదానినొకటి ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం బారినపడిన వెహికల్స్‌ను క్రేన్ సాయంతో తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు చెప్పారు. పొగమంచు ఉన్న సమయాల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.