
హైదరాబాద్ లోని సనత్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేసి, జింకలవాడ బస్తీలో రెండేళ్ల చిన్నారిపైకి కారు ఎక్కించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపైకి కారు దూసుకెళ్లింది. దీంతో ఆమె మృతిచెందింది. అతివేగంతో, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న యువకులు పరారైనట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.