వాటర్ ట్యాంక్లో కోతుల కళేబరాలు..కొన్ని రోజులుగా అవే నీళ్లే తాగుతున్న ప్రజలు

వాటర్ ట్యాంక్లో కోతుల కళేబరాలు..కొన్ని రోజులుగా అవే నీళ్లే తాగుతున్న ప్రజలు

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. 1వ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్లో కోతుల కళేబరాలు లభించాయి. ఒకటి కాదే..రెండు..దాదాపు 40 కోతుల మృతదేహాలు ట్యాంకులో లభించాయి. గత కొన్ని రోజులు ఇదే ట్యాంకు నుంచి మంచినీటిని సరఫరా చేస్తున్నారు ఎన్ఎస్పీ అధికారులు. ఆ నీటిని తాగిన అక్కడి ప్రజలు..ట్యాంకులో మరణించిన కోతుల మృతుల దేహాలు ఉన్నాయని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. 

వాటర్ ట్యాంకుపై రేకుల మూత తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లిన కోతులు.. బయటికి రాలేక అందులోనే మృతి చెందాయి. సుమారు 30 నుంచి 40 కోతుల మృత దేహాలు నీటిలో తేలుతున్నట్లు గుర్తించారు. వాటిని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు  మున్సిపల్ సిబ్బంది.. అయితే చుట్టు పక్కల ఉన్న కోతులు ఎగబడటంతో సాహసం చేయలేక పోతున్నారు.