ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన కార్గో విమానం

 ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన కార్గో విమానం

తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోస్టారికాలో కార్గో విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో  రెండు ముక్కలైంది. జర్మన్ లాజిస్టిక్స్ దిగ్గజం డీహెచ్ఎల్  కు చెందిన బోయింగ్ 757 చెందిన విమానం జువాన్ శాంటామారియా ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరింది.టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం కోస్టారికా ఎయిర్‌పోర్ట్‌ అనుమతి కోరారు. విమానాశ్రయం అధికారులు ల్యాండింగ్‌కు అంగీకరించడంతో తిరిగి వెనక్కి వచ్చింది. అత్యసవర ల్యాండింగ్ సమయంలో రన్ వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత  పట్టుకోల్పోయి పక్కకు వెళ్లిపోయి రెండు ముక్కలైంది. ఆ సమయంలో విమానంలో నుంచి పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన  అగ్నిమాపక  సిబ్బంది విమానం నుంచి వెలువడుతున్న పొగలను ఆర్పివేశారు. దీంతో శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా అధికారులు మూసివేశారు.ఈ ప్రమాదం నుంచి పైలట్లు క్షేమంగా బయటపడ్డారు.

మరిన్ని వార్తల కోసం

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్