సోమాలియా సముద్రపు దొంగలు : హైజాక్ అయిన షిప్ లో 15 మంది భారతీయులు..

సోమాలియా సముద్రపు దొంగలు : హైజాక్ అయిన షిప్ లో 15 మంది భారతీయులు..

సముద్రంలో ఓడల హైజాక్స్ పెరిగాయి.. సముద్రపు దొంగలు ఇటీవల కాలంలో తెగబడి మరీ నౌకలను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. వరసగా జరుగుతున్న ఘటనలకు కొనసాగింపుగా.. జనవరి 4వ తేదీ రాత్రి.. లైబేరియా జెండాలో ఉన్న ఓ నౌక.. అరేబియా సముద్రంలో ప్రయాణిస్తూ..  సోమాలియా తీరం దాటుతుండగా హైజాక్ అయ్యింది. 

ఇది కార్గో షిప్. ఎంవీ లీలా నార్పోల్క్ అనే పేరుతో పిలవబడుతుంది. ఆరుగురు సోమాలియా సముద్రపు దొంగలు.. అత్యాధునిక ఆయుధాలతో కార్గో షిఫ్ లోకి ఎక్కి.. సిబ్బంది మొత్తాన్ని బంధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత రక్షణ, నౌకా దళం అప్రమత్తం అయ్యింది. ముంబై నుంచి భారత నేవీ ప్రత్యేక నిఘా విమానాన్ని హైజాక్ అయిన కార్గో షిప్ ప్రాంతానికి వెళ్లింది. హైజాకర్లతో.. బందీలుగా ఉన్న భారత సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంది.

ఇదే సమయంలో కార్గో షిఫ్ ను విడిపించేందుకు అవసరం అయిన సాయం అందించేందుకు చెన్నై నుంచి మన INS యుద్ధ నౌక.. హైజాక్ అయిన ప్రాంతానికి వెళుతుంది. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి బందీలుగా ఉన్న 15 మంది భారతీయ సిబ్బందిని విడిపించేందుకు సన్నాహాలు చేస్తుంది భారత ప్రభుత్వం. ఈ కార్గో నౌక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది.. ఇందులో ఏ వస్తువులు, సరుకు ఉంది అనేది ఇంకా వెల్లడి కాలేదు. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడిస్తామని అధికారులు ప్రకటించారు.