పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్లో వాటా అమ్మిన కార్లైల్

పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్లో  వాటా అమ్మిన కార్లైల్

న్యూఢిల్లీ:  ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లైల్ గ్రూప్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్​లో తనకున్న మొత్తం 10.44 శాతం వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేసింది. ఈ అమ్మకం ద్వారా కార్లైల్ గ్రూప్‌నకు దాదాపు రూ. 2,712 కోట్లు లభించాయి. 

తన అనుబంధ సంస్థ క్వాలిటీ ఇన్వెస్ట్​మెంట్ ​హోల్డింగ్స్​ ద్వారా మొత్తం 2.71 షేర్లను బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో అమ్మింది. ఒక్కో షేరును రూ.వెయ్యి చొప్పున అమ్మింది. కోటక్​మహీంద్రా ఎంఎఫ్​, కెనరా రొబెకో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, సిటీ గ్రూప్​ వంటి కంపెనీలు షేర్లను దక్కించుకున్నాయి.