హైదరాబాద్: లాడ్జిలో కడప కార్పెంటర్ దారుణ హత్య

V6 Velugu Posted on Nov 22, 2019

కడప నుంచి హైదరాబాద్ వచ్చి ఓ లాడ్జిలో దిగిన కార్పెంటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  కాచిగూడ తారకరామా థియేటర్ ఎదురుగా ఉన్న లాడ్జిలో ఈ ఘటన జరిగింది.

గురవారం కడప నుండి వచ్చి కాచిగూడలోని హోటల్ హైదరాబాద్ కంఫర్ట్ రెసిడెన్సీలో నలుగురు వ్యక్తులు దిగారు. వారిలో ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. కర్కశంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ రోజు సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనపై హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని రెడ్డి సాయి కుమార్ (24)గా గుర్తించారు. అతడు  కార్పెంటర్‌గా పని చేస్తుంటాడని తెలిసింది.

అసలు ఈ హత్య ఎలా జరింది? కారణాలు ఏమిటీ? వాళ్లు హైదరాబాద్ ఎందుకు వచ్చారు? మృతుడితో పాటు ఉన్నవాళ్లెవరు? హంతకులెవరు? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జి రిజిస్టర్, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఎంక్వైరీ సాగిస్తామని చెబుతున్నారు.

MORE NEWS: 

కాలిపై కాలేసుకుని కూర్చోవద్దు: అమెరికా డాక్టర్ సలహా

కార్డు లిమిట్​ పెంచుతమని.. అన్​ లిమిటెడ్​ దోపిడీ

పోలీస్ స్టేషన్ ముందే ASI ఆత్మహత్య యత్నం

 

Tagged Hyderabad, murder, kadapa, lodge, kachiguda, carpenter, Taraka rama theater

Latest Videos

Subscribe Now

More News